చట్టాలపై అవగాహనతో నేరాల నియంత్రణ
బీసీ మహిళల వసతి గృహంలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న
జిల్లా పదో అదనపు న్యాయమూర్తి నరేష్
అనకాపల్లి: విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉన్నట్టయితే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా పదో అదనపు న్యాయమూర్తి, ఎంఎల్‌ఎస్‌సీ జిల్లా చైర్మన్ వి.నరేష్ అన్నారు. మండలంలో గుండాల జంక్షన్ బీసీ మహిళల విద్యార్థినుల వసతిగృహంలో ఆదివారం మండల న్యాయసేవాధికార సంఘం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.ధర్మారావు, వసతి గృహం అధికారి సబిత పాల్గొన్నారు.


