యువతి అదృశ్యంపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: పట్టణంలోని తులసీ సినిమాహాలు ప్రాంతానికి చెందిన చెక్కా సన్యాసిరాజు(శివ), కుమార్తె చెక్కా గౌరీ పార్వతి (22) అదృశ్యమైనట్టు పట్టణ ఠాణాలో ఆదివారం కేసు నమోదైంది. పట్టణంలోని రంగావారి వీధిలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి ఈ నెల 8వ తేదీ శనివారం రాత్రి 7.40 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి తాను పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నట్టు చెప్పింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద కుటుంబ సభ్యులు వెతికారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనపుడు నీలం రంగు టాప్ ధరించి ఉన్నట్టు, ఆమె తెలుపురంగులో ఉండి 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్నట్టు ఫిర్యాదులో తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


