రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఎస్.రాయవరం: మండలంలో గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఊడి రంజిత్ (28)తలుపులమ్మ లోవ నుంచి స్వగ్రామం వస్తుండగా కారుని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైకుతో రోడ్డుపై పడిపోయాడు. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. బైకుపై ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్టు చెప్పారు. వివరాలు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.


