
డిసెంబరుకు అనకాపల్లి స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి
అనకాపల్లి: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) మోహిత్ సోనాహి అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. స్టేషన్ పరిధిలో 1, 2, 3 ప్లాట్‌ఫారంలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పగలు, రాత్రి సమయంలో స్టేషన్ పరిధిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీసీ కెమేరాల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. స్టేషన్ అభివృద్ధి పనులు ఈ ఏడాది డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం ప్రశాంత్, సీనియర్ డీవోఎం, డి.నరేంద్రవర్మ, ఏడీఎన్ కృష్ణయ్య, అనకాపల్లి స్టేషన్ మేనేజర్ సత్యనివాస్, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ కంటెర్ల నవీన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.