
4 రోజుల్లో చోరీ కేసు ఛేదన
నక్కపల్లి: చోరీ కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఈ నెల 8వ తేదీన వేంపాడులో కొత్త నాగేశ్వరరావు ఇంట్లో చోరీ జరిగింది. భోజన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తాళాలు పగుల గొట్టి రూ.72 వేలు, 53 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సీసీఫుటేజీల ఆధారంగా డీఎల్‌పురం గ్రామానికి చెందిన గింజాల అప్పారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మధ్యవర్తుల సమక్షంలో అతడి నుంచి 27.25 గ్రాముల బంగారు చైన్, 14.78 గ్రాముల లాకెట్, 3 గ్రాముల లక్ష్మీదేవి ఉంగరం 7.86 గ్రాముల బంగారు ముద్ద, ఒక గ్రాము ఉంగరం, రూ.72 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు, ట్రైనీ ఎస్‌ఐ అంజు, తదితరులు పాల్గొన్నారు.

4 రోజుల్లో చోరీ కేసు ఛేదన