
ప్లాంట్ భద్రతా వ్యవస్థను బలహీనం చేశారు
స్టీల్‌ప్లాంట్ ఆస్తులను దొడ్డిదారిన దోచుకోవడానికి పెద్దస్థాయిలో కుట్ర జరుగుతోంది. భద్రతా వలయంలో ఉంటూ నిరంతరం రూ.వేల కోట్ల ఉత్పత్తులున్న చోట్ల బయట వాహనాల్లో వచ్చి చోరీ చేస్తే.. ప్లాంట్‌లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కాపర్ స్టేవ్స్ ఒక్కో ప్లేట్ 1.4 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఎత్తాలంటే హైడ్రాలిక్ క్రేన్, లారీ అవసరం. అలాంటివి ఆరు కాపర్ స్టేవ్‌లు మాయమయ్యాయి. ఈ నేరానికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసి, సెక్యూరిటీని బలహీనపరిచారు. ప్రజల ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన చోట, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఇంతవరకూ ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం గర్హనీయం.
– అయోధ్యరామ్, కన్వీనర్,
విశాఖ ఉక్కు పోరాట కమిటీ