
మండల స్థాయిలో స్కూలు గేమ్స్‌కు సన్నద్ధం
కశింకోట: మండల స్థాయిలో స్కూలు గేమ్స్ పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో గురువారం సాయంత్రం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ నిర్వహణకు పీడీలు, హెచ్‌ఎంలు సమన్వయంతో వ్యవహరించి ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, యోగా, త్రో బాల్, షటిల్ బ్యాడ్మింటన్, తదితర ఏడు ఆటలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి తర్వాత జోన్ స్థాయిలో నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత యధావిధిగా జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా కె. మహాలక్ష్మినాయుడు, పరిపాలన కార్యదర్శిగా అచ్చయ్యమ్మలను నియమించారన్నారు. వీరిని సమావేశంలో అభినందించారు. ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు నాయుడు పాల్గొన్నారు.