
రాష్ట్ర స్థాయి వుషూ పోటీలకు గురుకుల విద్యార్థినులు
రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థినులు
నర్సీపట్నం:
స్టేట్ స్కూల్ గేమ్స్ వుషూ పోటీలకు నర్సీపట్నం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. విశాఖలో సంస్కృతి గ్లోబ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం జరిగిన జిల్లా స్థాయి అండర్ –19 స్కూల్ గేమ్స్ వుషూ పోటీల్లో గురుకుల విద్యార్థినులు పి.దుర్గా భవాని 45 కేజీలు, బి.కావ్య 52 కేజీలు, పి.జ్యోష్ణ మేరీ 60 కేజీలు, వి.ప్రణితి 65 కేజీల విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. పీడీ సాయి పర్యవేక్షణలో వుషూ కోచ్ వేపాడ ప్రియాంక శిక్షణలో మెడల్స్ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ రాజేశ్వరి, శాప్ కోచ్ అబ్బు అభినందించారు.