
బైకుపై వెళుతూ ఆగిన బస్సును ఢీకొని..
రావికమతం : మండలంలోని పిల్లవానిపాలెం దాటిన తరువాత గొంప దగ్గరలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం (ఎపి 39 కువై 2649 )పై వెళ్తూ ఆర్టీసీ బస్సు (ఎపి35 జెపి 0087)ను ఢీకొట్టి కంచర్ల రామారావు(70) అనే వ్యక్తి మృతి చెందాడు. రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామానికి చెందిన కంచర్ల రామారావు బుధవారం సాయంత్రం గుడ్డిపలో వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామం పెదమదీనకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తూ ఆగింది. దీంతో బైకుపై వెనుకగా వస్తున్న రామారావు బస్సు వెనుక బలంగా ఢీకొన్నాడు. పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ బస్సు దిగివచ్చి చూడగా అప్పటికే రామారావు రోడ్డుపై పడి ఉన్నాడు. అతరిరి వైద్యం కోసం రావికమతంలోని ప్రైవేటు అస్పత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య పార్వతి, వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ , కండక్టర్‌లను అదుపులోనికి తీసుకొన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. రామారావు మృతితో పెదమదినాలో విషాదఛాయలు అలముకున్నాయి.