
లైంగిక దాడి దోషులను కఠినంగా శిక్షించాలి
దేవరాపల్లి: విశాఖపట్నం సీతమ్మధారలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం చేసి, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడంతో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు.