
ఉత్సాహంగా ఓనం సంబరాలు
పాయకరావుపేట: ఓనం సంబరాలు శ్రీప్రకాష్ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థినులు కేరళా సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కేరళాలో ప్రాచుర్యం పొందిన పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఓనం పండగ విశిష్టతను ఓ విద్యార్థిని చక్కగా వివరించి ఆకట్టుకుంది.
ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులకు వివిధ రాష్ట్రాల ఆచార, వ్యవహారాలపై అవగాహన ఏర్పడి, మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతుందని ప్రిన్సిపాల్ భానుమూర్తి తెలిపారు.