
డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు సన్మానం
నర్సీపట్నం: డీఎస్సీ–2025లో ఎంపికై న అభ్యర్థులను పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ విద్యార్థులను ప్రయోజకులను చేసే అవకాశాన్ని కొత్త ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంకిత భావంతో పని చేసి ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఎంపికై న 200 మందిని సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్, యూనియన్ ప్రతినిధులు రమణ, అప్పారావు, ప్రసాద్, వరహాలనాయుడు, జి.వి.రమేష్, తదితరులు పాల్గొన్నారు.