చావైనా.. బతుకై నా.. | - | Sakshi
Sakshi News home page

చావైనా.. బతుకై నా..

Sep 11 2025 2:41 AM | Updated on Sep 11 2025 2:41 AM

చావైన

చావైనా.. బతుకై నా..

●ఎన్నాళ్లీ కష్టాలు?
ఉరకగెడ్డ దాటాల్సిందే..

తాచేరు గెడ్డపై నిర్మించిన కర్రల వంతెన

మాడుగుల:

మండలంలోని శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాలకు వర్షాకాలం వస్తే గండమే. బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వారి బతుకు నరకమే. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే దుస్థితి. ఈ గిరిజనులు మండల కేంద్రానికి రావాలన్నా, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా ఉరకగెడ్డ దాటవలసిందే. చిన్నపాటి వర్షం కురిసినా సరే గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. అత్యవసర సమయాలలో గెడ్డ దాటాలంటే ప్రాణాలు గుప్పెట పెట్టుకుని ఈదవలసిందే. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఈ గిరిజన గ్రామాలకు రహదారితోపాటు ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరయ్యాయి. కొంత రోడ్డు పనులు కూడా జరిగాయి. ఈలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఈ వంతెన ఊసెత్తలేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

కర్రల వంతెనపై ప్రమాదకర ప్రయాణం

తాటిపర్తి పంచాయతీ అజయ్‌పురం వద్ద కొండగెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనపై ప్రయాణించేటప్పుడు అదుపు తప్పితే ప్రాణాలు నీటిలో కలసి పోతున్నాయి. రెండు నెలల క్రితం సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఉరకగెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ గిరిజనులు గెడ్డలో దిగి ఆందోళన చేపట్టారు. అయినా సరే కూటమి సర్కారులో ఎటువంటి స్పందన లేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, గిరి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

వారం రోజుల క్రితం అజయ్‌పురం గ్రామానికి చెందిన మాచమ్మ.. తాచేరు గెడ్డ కర్రల వంతెనపై కూలి పనికి వెళుతూ అదుపు తప్పి గెడ్డలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆమె మతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకురావడానికి అదే కర్రల వంతెనపై అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. హృదయం ద్రవించిపోయే ఈ దుర్ఘటన నేపథ్యం ఏడు గిరిజన గ్రామాలతో ముడిపడి ఉంది.

వర్షం వస్తే ఏడు ఆదివాసీ గ్రామాలు దిగ్బంధం

తాచేరు గెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం

ఈ వంతెన నుంచే జారిపడి ఇటీవల మహిళ మృతి

వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరు చేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

ఎన్నికల కోడ్‌తో ఆగిన పనులు

కూటమి సర్కార్‌ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకోని వైనం

వంతెన నిర్మాణం చేపట్టాలి

శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాల చుట్టూరా ఉరకగెడ్డ ప్రవహిస్తోంది. వర్షాకాలంలో గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. మా పూర్వీకుల నుంచి ఇదే పరిస్థితి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కొంతవరకు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. వంతెన నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి సర్కారు వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా వంతెన ఊసెత్తలేదు. పలుసార్లు సీపీఎం నాయకులతో కలసి నిరసనలు వ్యక్తం చేసినా సరే పట్టించుకోలేదు. గర్భిణులను వర్షాకాలంలో గెడ్డ దాటించడం కష్టంగా ఉంది.

–శోలం రమేష్‌, గిరిజన సంఘ నాయకుడు, కొత్తవలస

చావైనా.. బతుకై నా..1
1/3

చావైనా.. బతుకై నా..

చావైనా.. బతుకై నా..2
2/3

చావైనా.. బతుకై నా..

చావైనా.. బతుకై నా..3
3/3

చావైనా.. బతుకై నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement