రైతన్న కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

రైతన్న కన్నెర్ర

Sep 10 2025 3:31 AM | Updated on Sep 10 2025 3:53 AM

పోలీసుల ఆంక్షల మధ్య హోరెత్తిన ‘అన్నదాత పోరు’

యూరియా కొరతపై కదం తొక్కిన వ్యవసాయదారులు

ఎన్ని ఆటంకాలు కల్పించినా వైఎస్సార్‌సీపీ ఆందోళన సూపర్‌ సక్సెస్‌

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన

అవసరమైనంత ఎరువులు అందించాలని అధికారులకు వినతి

ప్రతి ఖరీఫ్‌ సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ ఎంత యూరియా అవసరమో అంచనా వేసుకుంటుంది. అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకొని అమలు చేస్తుంది. వరినాట్లు వేసే సరికి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఇవేవీ జరగలేదు. ముఖ్యమంత్రికి ముందుచూపు ఉండాలి. మా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం సకాలంలో అందించాం. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల గత ఏడాది ఇబ్బంది రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎరువులు వాడితే పంట దిగుబడి రాదంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు అయితే ఎరువులు ఇవ్వండని అడిగిన రైతులను జైల్లో వేసి, కేసులు నమోదు చేయాలంటూ భయపెడుతున్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి మారకుంటే వైఎస్సార్‌సీపీ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది.

–గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అనకాపల్లిలో ఆర్డీవో కార్యాలయానికి భారీ సంఖ్యలో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు

యూరియా కొరతపై అన్నదాత కన్నెర్ర జేశాడు.

వ్యవసాయం దండగ అన్న రీతిలో రాష్ట్ర

ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన చెందాడు.

తమ సమస్యలను పట్టించుకోనందుకు ఆగ్రహం

వ్యక్తం చేశాడు. అందుకే పోలీసుల ఆంక్షలను

సైతం లెక్కచేయకుండా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యం

లో మంగళవారం నిర్వహించిన ‘అన్నదాత

పోరు’లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఎన్ని ఆటంకాలు పెట్టినా అదరలేదు.. బెదరలేదు.

జిల్లాలోని అన్ని మండలాల్లో వేకువజాము

నుంచే వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు,

జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు,

ముఖ్యమైన జిల్లా స్థాయి నాయకులను

గృహ నిర్బంధం చేసి ‘అన్నదాత పోరు’ను

అడ్డుకునేందుకు కూటమి సర్కార్‌ కుటిల

ప్రయత్నాలు చేసింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా

అనకాపల్లి, నర్సీపట్నంలలో నిర్వహించిన

నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వందలాదిమంది నినాదాలతో హోరెత్తించారు.

కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన రైతులకు శాపంగా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో సాధారణ సాగులో 70 శాతమే పంట వేశారు. దానికే ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతు రాజుగా ఉండేవాడు. విత్తనాలు, ఎరువులు ఇంటికే డోర్‌ డెలివరీ చేశావాళ్లం. కూటమి నాయకులు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. –ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి, నర్సీపట్నంలలో తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం సందర్భంగా ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది. అనకాపల్లి రింగురోడ్డులో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 నుంచి 20 మంది వరకే అనుమతిస్తామని, అంతకు మించితే అరెస్ట్‌ చేస్తామంటూ డీఎస్పీ శ్రావణి, అనకాపల్లి టౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌ రైతులను, పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటూ మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కు డీఎస్పీ నోటీసు కూడా ఇచ్చారు. అయినా ఎక్కడా రైతులు భయపడలేదు. మమ్మల్ని అరెస్ట్‌ చేసుకున్నా.. మాపై కేసులు పెట్టుకున్నా ర్యాలీ చేసి తీరుతాం.. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామంటూ పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు చుట్టుముట్టినా ఎక్కడా బెదరలేదు.. జంకలేదు.. రైతులకు కొరత లేకుండా యూరియా ఇవ్వాలంటూ నినాదాలు చేసుకుంటూ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ రెండు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావు పేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నుంచి రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో షేక్‌ ఆయిషాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మలసాల భరత్‌కుమార్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్‌, దంతులూరి దిలీప్‌కుమార్‌, మలసాల కుమార్‌రాజా, పైలా శ్రీనివాసరావు, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్‌, గవర కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ బొడ్డేడ శివ, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్‌, పరవాడ జెడ్పీటీసీ పీఎస్‌ రాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌, నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు వడ్డాది అప్పలరాజు, సీనియర్‌ నాయకులు శరగడం చినఅప్పలనాయుడు, గండి రవికుమార్‌, బోకం రామునాయుడు, కె.ఎం నాయుడు, కోరకుండ రాఘవ, వేగి త్రినాథ్‌, తగరంపూడి నూకరత్నం, తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎన్ని టన్నుల యూరియా అవసరమో ప్రభుత్వానికి తెలియదా? రైతుకు అర ఎకరం ఉన్నా.. ఐదెకరాలున్నా ఒక యూరియా బస్తాయే ఇస్తున్నారు. అదెలా సరిపోతుంది. అధికారులు యూరియా కొరత లేదు, అడిగినంతా ఇస్తున్నామంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడాలని వారిని వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా.. గతేడాదిలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతామేమోనని ఆవేదన చెందుతున్నారు.

–బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు యూరియా కావాలంటూ కదం తొక్కారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసుల ద్వారా రైతుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారు. ఎరువుల కొరత నివారించాలి. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే చెల్లించాలి. యూరియా కొరత ఉన్నా.. అధికారులు మాత్రం లేదంటున్నారు. ప్రైవేట్‌ దుకాణాల్లో టీడీపీ నేతలు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది కూడా దిగుబడి రాదేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలి. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి.

–కరణం ధర్మశ్రీ, వూజీ ప్రభుత్వ విప్‌

కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

కూటమి పాలన... రైతులకు శాపం

కూటమి పాలన... రైతులకు శాపం

ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా?

ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా?

రైతుల గొంతునొక్కే ప్రయత్నం

రైతుల గొంతునొక్కే ప్రయత్నం

రైతన్న కన్నెర్ర1
1/6

రైతన్న కన్నెర్ర

రైతన్న కన్నెర్ర2
2/6

రైతన్న కన్నెర్ర

రైతన్న కన్నెర్ర3
3/6

రైతన్న కన్నెర్ర

రైతన్న కన్నెర్ర4
4/6

రైతన్న కన్నెర్ర

రైతన్న కన్నెర్ర5
5/6

రైతన్న కన్నెర్ర

రైతన్న కన్నెర్ర6
6/6

రైతన్న కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement