
ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు
నర్సీపట్నం: మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల హౌస్ అరెస్ట్
సాక్షి, అనకాపల్లి: ఎమర్జెన్సీని తలపించేలా ‘అన్నదాత పోరు’ను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుటిల ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మంగళవారం వేకువజాము నుంచే వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని గృహ నిర్బంధం చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకుండా వారిని కట్టడి చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గృహ నిర్బంధం చేసిన వారిలో.. నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, అడ్డురోడ్డులో పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, చినదొడ్డిగల్లులో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, కోటవురట్ల మండలం తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ దత్తుడు సీతబాబు, జెడ్పీటీసీ సిద్దాబత్తుల ఉమాదేవి, పాముల వాకలో మండల పార్టీ అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, పాయకరావుపేట మండలం పెంటకోటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, నామవరంలో ఎంపీపీ ఈసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ లంక సూరిబాబు ఉన్నారు. అడ్డురోడ్డులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నానని, జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి వెళ్లక తప్పదని, పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించడంతో జోగులును మాత్రం విడిచిపెట్టారు.
చోడవరం నియోజకవర్గం: పార్టీ బుచ్చెయ్యపేట మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వడ్డాది టౌన్ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి జోగా కొండబాబు, రోలుగుంట జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ, లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు, రావికమతం మండల అధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, ఎంపీపీ పైలా రాజు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తలారి ఆదిమూర్తిలను హౌస్ అరెస్ట్ చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గం: నర్సీపట్నంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మాకవరపాలెంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, ఎంపీపీ సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, నాతవరం జెడ్పీటీసీ అప్పలనర్స, మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైల సునీల్‌లను హౌస్ అరెస్ట్ చేశారు.
మాడుగుల నియోజకవర్గం: కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల శివాజీరాజు, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, మాడుగుల ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, దేవరాపల్లి ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడులను గృహ నిర్బంధం చేశారు.
యలమంచిలి నియోజకవర్గం: ఎంపీపీ బోదెపు గోవింద్, జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి, ఆమె భర్త సేనాపతి రాము, అచ్యుతాపురం ఎంపీపీ కోన సంధ్య లచ్చన్నాయుడు, మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, జెడ్పీటీసీ లాలం రాములను హౌస్ అరెస్ట్ చేశారు.
అనకాపల్లి నియోజకవర్గం: అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్‌రాజు, మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబులను గృహ నిర్బంధం చేశారు.
మాకవరపాలెం: హౌస్ అరెస్ట్‌లో ఉన్న రుత్తల యర్రాపాత్రుడు
గొలుగొండ : నిర్బంధంలో
పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత

ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు

ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు

ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు

ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు

ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు