
పోలీసు శాఖకు కొత్త అతిథి ‘రియో’
అనకాపల్లి: జిల్లాలో పోలీస్ శాఖకు కొత్త అతిథి వచ్చింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ 6వ బెటాలియన్‌లో 10 నెలల పాటు శిక్షణ పొందిన జాగిలం ‘రియో’మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సందడి చేసింది. ఈ జాగిలాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. బెల్జియం మలనాయిస్ జాతికి చెందిన ఈ ఆడ జాగిలం ట్రాకింగ్, పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించే జాగిలాల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 7 జాగిలాలు ఉండగా.. కొత్తగా చేరిన రియోతో వీటికి సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ రిజర్వ్‌డ్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐ బి.రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి అడ్డాల ఆదినారాయణ పాల్గొన్నారు.