క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌

Sep 10 2025 3:31 AM | Updated on Sep 10 2025 3:31 AM

క్రిట

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌

హెచ్‌డీయూ(6 బెడ్లు), డీయూ, అనస్థీషియా రూమ్‌, అటెండెంట్‌ వెయిటింగ్‌, ఐసీయూ (10 బెడ్లు), ఓటీలు– 2 నంబర్లు, స్టెరిలైజేషన్‌, ఎలక్ట్రికల్‌ రూమ్‌, ఈక్యూఎంటీ రూమ్‌, ఫ్రీ అండ్‌ పోస్ట్‌ ఓపీ– 5 బెడ్లు డీఆర్‌ డ్యూటీ, స్టాఫ్‌ నర్సులు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.

ఐఎస్‌వో రూమ్‌ (2 పడకలు), డైనింగ్‌ మెల్‌ –2 నంబర్లు, డీయూ, ఏఎస్‌వో వార్డు (6 పడకలు), క్లినికల్‌ టెస్ట్‌, ఐఎస్‌వో వార్డు (15 పడకలు), కౌన్సెలింగ్‌ రూమ్‌లు–2 నోస్‌, డౌఫింగ్‌, ఐసీయూ–ఐఎస్‌వో స్టోర్‌, డీఆర్‌ డ్యూటీ, స్టాఫ్‌ రూమ్‌, ఐఎస్‌వో వార్డు –2 నంబర్లు (ఒక్కొక్కటి 2 బెడ్లు), మరుగుదొడ్లు ఉంటాయి.

డిలేసిస్‌ (4 పడకలు), డాక్టర్‌ రూమ్‌, డోనింగ్‌, డీయూ ఎంసీహెచ్‌( 2 పడకలు), ఎల్‌డీఆర్‌ (ఒక్కొక్కరికి 1 బెడ్‌), డోనింగ్‌ ఫిమేల్‌, ఆర్‌వో డయాలైజర్‌, అల్ట్రా సౌండ్‌, ప్లాస్టర్‌ రూమ్‌, పీఓసీ ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ రూమ్‌, డ్యూటీ డాక్టర్‌/ఎగ్జామినేషన్‌ రూమ్‌, ఎమర్జెన్సీ వార్డు (6 పడకలు), మైనర్‌ ప్రొసీజర్‌, నర్సుల రూమ్‌, ఇంజెక్షన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌, మరుగుదొడ్లు ఉంటాయి.

రెండో అంతస్తు

గ్రౌండ్‌ ఫ్లోర్‌

మొదటి అంతస్తు

అనకాపల్లి: పట్టణంలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో అత్యధిక రసాయన పరిశ్రమలు ఉండటంతో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందక మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలూ వైద్య సేవలందించనున్నారు.

జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతున్నారు. గాయపడిన మరికొందరిని విశాఖ సిటీలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించే క్రమంలో కొంతమంది మార్గమధ్యంలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టయితే గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించినట్టయితే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విషయమై 2023 డిసెంబర్‌లో సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీ బీవీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, జిల్లా అధికారులు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరగా, క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణానికి రూ.22.5 కోట్లు విడుదల చేశారు. 2024 ఫిబ్రవరిలో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక పార్కింగ్‌ స్థలం...

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌కు ఎదురుగా వాహనాలు నిలుపుదల చేసేందుకు ఎక్కువగా పార్కింగ్‌ స్థలం ఉంది. రోగితోపాటు రోగి బంధువు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెలాఖరుకు పూర్తవుతాయి

రెండు మాసాల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తాం. వెంటనే ఏడాదిపాటు కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణ తర్వాత రాష్ట్ర ఆరోగ్యశాఖకు అప్పగిస్తుంది.

– కృష్ణారావు, సూపరింటెండెంట్‌, ఎన్టీఆర్‌ ఆస్పత్రి, అనకాపల్లి

ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణ పనులు ఈ నెల 30వ తేదీలోపు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసిన వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ 50 పడకలకు కావలసిన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రోగులకు ఉపయోగించే అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తుంది. ఏడాది పాటు వైద్యులకు, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తుంది. రెండో ఏడాది నుంచి పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వస్తుంది.

చివరి దశలో 50 పడకల ఆస్పత్రి పనులు

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో 24 గంటలూ వైద్యం...

క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్నారు. ఇక్కడ మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌(ఆస్పత్రి)ను ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రికి అనుసంధానం చేస్తారు. క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో, డయాలసిస్‌ రోగులకు ప్రత్యేకంగా కొన్ని బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌1
1/3

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌2
2/3

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌3
3/3

క్రిటికల్‌ సమస్యా.. డోంట్‌ కేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement