
రేపటి నుంచి స్కూల్ గేమ్స్‌కు ఎంపికలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఎంపికలు(అండర్–19 బాల బాలికలకు) ఈ నెల 11 నుంచి 13 వరకు వయో విభాగాల వారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జూనియర్ కళాశాలల గేమ్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఏ పుష్పలత తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే బాల బాలికలు 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఓపెన్ స్కూల్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఎంపికలకు అనర్హులు. అర్హులైన విద్యార్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్థి పెన్ నెంబర్, వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్ తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94408 85898, 99669 31556, 98854 73808, 99516 76965, 99850 65340 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.