
ఉత్సాహంగా 5కె రెడ్ రన్
అనకాపల్లి టౌన్: పట్టణంలో ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా జిల్లా స్థాయి మారథాన్ 5కె రెడ్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్ కృష్ణారావు ప్రారంభించారు. పూడిమడక రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ రన్‌లో జిల్లా వైద్య విద్యా అధికారి విభాగం సహకారంతో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా పురుషుల్లో రామానాయుడుకు రూ.10 వేలు, వినోద్‌కు రూ.7 వేలు, సీ్త్రలలో వాణికి రూ.10 వేలు, దివ్యకు రూ.7వేలు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కే రామచందర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ స్పందన ప్రశాంతి, డీఎండీవో చిరంజీవి, ఐసీటీసీ కౌన్సిలర్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.