
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మునగపాక: మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని వి.వినీల జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినీల తొలి నుంచి బాల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ ఉండేది. అంతర్ జిల్లాల పోటీ ల్లో పాల్గొన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పతకం సాధించి మరింత ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి తెలిపారు. వినీలతో పాటు ఆమె కృషికి కారణమైన పీటీ మహలక్ష్మిని ఎస్‌ఎంసీ చైర్మన్ జోగినాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.