జిల్లాలో పరిస్థితి ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పరిస్థితి ఇలా..

Sep 9 2025 8:12 AM | Updated on Sep 9 2025 1:00 PM

జిల్ల

జిల్లాలో పరిస్థితి ఇలా..

క్లస్టర్‌ విధానం రద్దు చేయాలి

కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన క్లస్టర్‌ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాశీపురం రైతు సేవా కేంద్రాన్ని సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రైవాడలో కలపడం దారుణం. దీంతో కాశీపురం పరిధిలోని రైతులంతా ఎరువులు కోసం రైవాడ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి క్లస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలి.

– దాసరి గోపి, రైతు, కాశీపురం.

పంటల విస్తీర్ణం ఆధారంగా...

ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ పంటల విస్తీర్ణం ఆధారంగా రైతు సేవా కేంద్రాలను క్లస్టర్లుగా విభజించాం. మండలంలో 20 రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశాం. అక్కడ సిబ్బందిని సర్దుబాటు చేశాం. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందించేలా చర్యలు చేపడుతున్నాం. ముషిడిపల్లి, కాశీపురం తదితర గ్రామాల రైతులకు క్లస్టర్లలో పంపిణీ చేయడంతో కాస్తా ఇబ్బంది పడడం వాస్తవమే.

–ఎల్‌వై. కాంతమ్మ, మండల వ్యవసాయ అధికారి, దేవరాపల్లి

ఒక్క బస్తా అయినా ఇవ్వలేదు..

మ్ములో వేయడానికి వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా యారియ అందుబాటులో లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో, ప్రైవేటు షాపుల్లో ఎప్పుడు వెళ్లినా యూరియా దొరికేది. ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు షాపుల్లో యూరియా దొరక్కపోతే మేం ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి.

– బండి రాజారావు, లోపూడి రైతు,

బుచ్చెయ్యపేట మండలం

సాక్షి, అనకాపల్లి:

రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో యూరియాను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే ముందస్తుగా ఎన్ని టన్నుల యూరియా అవసర ముంటుందో ప్రభుత్వానికి తెలిసినప్పటికీ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమకూర్చిన ఎరువులు సమృద్ధిగా ఉండడంతో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినా.. రైతులకు అంత కొరత రాలేదు. కానీ ఈ ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రం ఇటు పెట్టుబడి పెట్టలేక..అటు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడతున్నారు. వరినాట్లు ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. యూరియా కోసం రైతుసేవాకేంద్రాల్లో, పీఏసీఎల్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఆవేదన రైతు ఒకటి తీసుకునే దగ్గర రెండు తీసుకుంటున్న పరిస్థితులున్నాయి. అది కూడా ఎక్కడైనా స్టాక్‌ వచ్చిందంటే తొలుత కూటమి నేతలు సగంకు పైగా దారి మళ్లిస్తున్నారు. మిగిలిన వాటిని అరకొరగా రైతులకు ఇస్తున్నారు. రైతు వేసే వరి నాట్లు ఆధారంగా రెండు మూడు కావాల్సిన వారికి కూడా ఒకటే యూరియా బస్తా ఇవ్వడంతో చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తోంది. గత నెల రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది, చాలాచోట్ల రైతులు.. ఎరువుల కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా రహదారుల మీదకొచ్చి రాస్తారోకోలు చేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందిపై రైతులు తిరగబడుతున్నారు.

నానో యూరియాను అంటగట్టే యత్నం..

రైతులు వినియోగించే ఎరువులు, యూరియాపై కూటమి సర్కార్‌ దొంగాట ఆడుతోంది. సరిపడా యూరియా, ఎరువులు నిల్వలు ఉన్నాయంటూ అధికారులు పేపర్‌ లెక్కలే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేకుండా పోయింది. పంటలు వేసిన తర్వాత యూరియా, ఇతర ఎరువులు ఎంతో అవసరం ఉంటుంది. ప్రైవేట్‌ దుకాణాల్లో నానో యూరియా, నానో డీఏపీల పేరిట రైతులకు అంటకట్టడానికి ఆలోచనతో కూటమి సర్కార్‌ యూరియాను కృత్రిమ కొరతను సృష్టిందన్న విమర్శలు వస్తున్నాయి. యూరియా సరిపడా వస్తుందని రైతులకు వ్యవసాయ అధికారులు నచ్చచెబుతున్నారు. కానీ యూరియా రాకపోవడం, సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. జిల్లాకు చేరిన యూరియా, డీఏపీ ఎరువులు చేరినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్ధాయిలో ఇవి చేరుకోకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కూడా నానో యూరియా అమ్మకాలు పెంచాలని, ఇటు వ్యవసాయ అధికారులకు, అటు కూటమి సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నారు. యూరియాను విక్రయిస్తున్న సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలను లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇదే పరిస్థితిలో నానో యూరియాను కూడా కొనుగోలు చేయాలని, రైతుల నెత్తిన నానో యూరియా రుద్దడానికి వ్యవసాయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో

అన్నదాత పోరుబాట..

అనకాపల్లి జిల్లాలో యూరియా కొరతతో పలు ఇబ్బందులు గురవుతున్న రైతులకు అండగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9న అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద మరో పోరాటానికి సిద్ధమైంది. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో యూరియా కొరతపై అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాల వద్ద ‘అన్నదాత పోరుబాట’ పేరిట ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. జిల్లాలో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా రైతుల సంఘాల నాయకులు కూడా పాల్గొనాలని వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వైఎస్సార్‌సీపీ తెలిపింది. అనకాపల్లి, మర్దీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం ఆర్డీవో కు వినతి పత్రం అందజేయనున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాల సమస్య అనేది ఎక్కడా లేదన్నారు. ఈఖరీఫ్‌ సీజన్‌ లో యూరియాను రైతులకు అందించకుండా కూటమి నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనున్నారు.

కొన్ని ప్రైవేటు దుకాణాల్లోనే...

జిల్లా వ్యాప్తంగా 98 శాతం వరినాట్లు వేశారు. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. డీఏపీ అంతంతమాత్రంగానే ఉంది. కూటమి నేతల జోక్యం కారణంగా కొత్తగా యూరియా స్టాక్‌ వచ్చినా వారి అనుకూల ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల్లో రూ.400 నుంచి రూ.450 వరకూ వెచ్చించి రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ దుకాణాలకే యూరియా ఇస్తున్నారు.

కె.కోటపాడులో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులు (ఫైల్‌)

క్లస్టర్‌ విధానంతో కొత్త కష్టాలు

అన్నదాత పోరుబాట

జిల్లాలో ఖరీఫ్‌ రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటిలో వరి 1.60 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఈ ఖరీఫ్‌లో 20 వేల మెట్రిక్‌ టన్నులు ఎరువులు వినియోగిస్తారని అంచనా. అయితే జిల్లాలో ఇప్పటివరకూ 12 వేల మెట్రిక్‌ టన్నులు వరకూ యూరియా ఇచ్చారు. మరో 801 మెట్రిక్‌ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ సొసైటీలు, రైతు సేవాకేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో 1500 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రానుందని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు వెల్లడించారు.

దేవరాపల్లి: అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం మండల కేంద్రానికి వేళ్లే అవసరం లేకుండా రైతుల చెంతనే అన్నీ అందజేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేసి తీసుకువచ్చిన క్లస్టర్‌ విధానంతో అన్నదాతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. రెండు రైతు సేవా కేంద్రాలను కలిపి క్లస్టర్‌గా మార్పు చేయడంతో యూరియా, విత్తనాల కోసం రైతులు పక్క ఆర్‌ఎస్‌కేలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భారీ క్యూలైన్‌లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలంలో రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశారు. గరిశింగి, తెనుగుపూడి ఆర్‌ఎస్‌కేలను క్లస్టర్‌గాను, చింతలపూడి, నాగయ్యపేటను మరో క్లస్టర్‌గా, ఎం.అలమండ, పెదనందిపల్లిని మరో క్లస్టర్‌గా విభజించారు. ఎ. కొత్తపల్లి, ముషిడిపల్లి ఆర్‌ఎస్‌కేలను క్లస్టర్‌గా, కాశీపురం, రైవాడను క్లస్టర్‌గా, దేవరాపల్లిలోని రెండు ఆర్‌ఎస్‌కేలను మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. దీంతో ముషిడిపల్లి సచివాలయ పరిధిలోని రైతులకు ఎ.కొత్తపల్లి సచివాలయంలో, కాశీపురం రైతులకు ఎరువులు తీసుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైవాడ వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.

జిల్లాలో పరిస్థితి ఇలా..1
1/4

జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో పరిస్థితి ఇలా..2
2/4

జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో పరిస్థితి ఇలా..3
3/4

జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో పరిస్థితి ఇలా..4
4/4

జిల్లాలో పరిస్థితి ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement