
యూరియా..ఏదయ్యా..!
ఖరీఫ్ సీజన్ ఆరంభమై మూడు నెలలైనా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండడం లేదు. వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా నేటికీ యూరియా అందక పడిగాపులు కాస్తున్నారు. పగలనక, రాత్రనక యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వచ్చిన కొద్దిపాటి యూరియాను రైతులకు ఒక్కో కట్ట మాత్రం అందిస్తున్నారు. మరో పక్క యూరియా రైతులందరికీ అందుబాటులో ఉందంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత ఎరువుల కోసం రోడ్డెక్కుతున్నాడు. రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది.
● ఎరువులను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం
● పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
● జిల్లాలో 32,321 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
● అందుబాటులో 12 వేల టన్నులు
● ఎరువుల సరఫరాలో
కూటమి నేతల చేతివాటం
● రైతులకు మద్దతుగా
వైఎస్సార్‌సీపీ పోరుబాట
● నేడు ఆర్‌డీవో కార్యాలయం
ఎదుట నిరసన