
‘అన్నదాత పోరు’కు తరలిరండి..
అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మన రాష్ట్రం వ్యవసాయంపై అధారపడి ఉందని, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సకాలంలో యూరియా అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు యూరియా నిల్వ చేయడం జరిగిందని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అన్న యూరియాను రైతులకు సకాలంలో అందజేయడం వల్ల గత ఏడాది యూరియా సమస్య లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని రైతులకు సకాలంలో యూరియాను అందజేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాలు వద్ద అన్నదాత పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రైతులు హాజరు కావాలని ఆయన పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
గుడివాడ అమర్‌నాథ్