
విధుల్లో అంకితభావంతో గుర్తింపు
అనకాపల్లి: పోలీస్ శాఖలో అంకిత భావంతో విధులు నిర్వహించినట్టయితే మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం జిల్లాలో నలుగురు ఏఎస్‌ఐలు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన ఎం.డి.వై.మొహిద్దిన్, ఆర్.వి.రామనాయుడు, పి.శంకరరావు, ఎం.రాజారావులు ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన ఎస్‌ఐలు జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేయడం జరిగిందన్నారు. కొత్తగా పదోన్నతి పొందిన వారు పోలీస్‌శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చే విధంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కోరారు.