
నేత్రదాన ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు
తుమ్మపాల: నేత్రదాన అవశ్యకత, నేత్రదాన ప్రాముఖ్యతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ విజయ కృష్ణన్, జేసి.జాహ్నవి ప్రశంస పత్రాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 40వ నేత్రదాన పక్షోత్సవాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థ్ధులను సోమవారం కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో అభినందించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టి.డేవిడ్ కుమార్, బోడ మోహన్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలకు ప్రశంసాపత్రాలు