
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
ఉపాధి కోసం వినతి
డిగ్రీ చదువుకున్న తనకు ఉపాధి కల్పించాలని కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాలిబోయిన తరుణ్‌కుమార్ కలెక్టర్‌ను వేడుకున్నారు. పుట్టుకతో చర్మవ్యాధి ఉన్నప్పటికి సొంత కాళ్లపై నిలబడాలనే ఆశతో కూలీపనులు చేసుకుంటూ తల్లిదండ్రులు తనను డిగ్రీ చదివించారని, ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన చెప్పారు. దివ్యాంగుల కోటా లో ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ప్రత్యేక ఉప కలెక్టర్(ఏపీఐఐసీ) అనిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించి, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 232 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో 47 అర్జీల స్వీకరణ
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 47 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్టీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు–30, కుటుంబ కలహాలు–3, మోసపూర్తి హామీ–1, వివిధ విభాగాలకు చెందినవి–13 అర్జీలు వచ్చాయని చెప్పారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు ఆక్రమణపై ఫిర్యాదు
తన ఇంటిని ఆక్రమించి తప్పుడు దస్తావేజులు సృష్టించిన డి.శ్యామలపై పోర్జరీ కేసు నమోదు చేయాలని మునగపాక మండలం టి.సిరసపల్లికి చెందిన పొట్ల వీరునాయుడు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పనులు లేక కొన్నేళ్ల క్రితం కుటుంబంతో వలస పోయానని, ప్రస్తుతం కిడ్నీ సమస్యతో పనులు చేయలేక గ్రామంలో సొంతింటికి వస్తే సోదరి సముద్రాలు, ఆమె కుమార్తె శ్యామల అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు దస్తావేజులు చూపిస్తూ ఇబ్బందులు పెడుతున్నా రని వాపోయారు. రిజిస్ట్రార్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా.. అవి తప్పుడు దస్తావేజులని తెలిసిందని, వాటిని రద్దు చేసి పోర్జరీ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరిస్తున్న
కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి
క్షేత్ర స్థాయి పర్యటనతో
సమస్యల పరిష్కారం
అధికారులకు కలెక్టర్
విజయ కృష్ణన్ ఆదేశం
పీజీఆర్‌ఎస్‌కు 232 అర్జీలు

అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

అర్జీలపై నిర్లక్ష్యం వద్దు