
వాహనం ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం
● దేవరాపల్లిలో రోడ్డుపై తెగిపడిన తీగలు
● అర్ధరాత్రి జనసంచారం లేక పోవడంతో తప్పిన ముప్పు
విరిగిన స్తంభాన్ని, రోడ్డుపై తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగిస్తున్న సిబ్బంది
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ విద్యుత్ స్తంభం నేలకొరింది. విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు కొందరు గమనించి స్థానిక విద్యుత్ లైన్‌మెన్ బి.రాముకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను మళ్లించి, తెగిన విద్యుత్ వైర్లను తొలగింపజేశారు. విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు.