
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా
నర్సీపట్నం: పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నూతనంగా నియమితులైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబానికి మొదటి నుండి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తన సతీమణి అనితకు డీసీసీబీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారని, ప్రస్తుతం తనకు పార్టీ రాష్ట్రస్థాయి కమిటీలో అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ సిటీలోని విశాఖ నార్త్, దక్షణ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు.
ధర్నాను విజయవంతం చేయండి..
రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులపై పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 9న ఆర్డీవో కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఽచేపడుతున్న ఆందోళను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి నాయకుల తీరును ఎండగట్టేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సన్యాసిపాత్రుడు