
కానరాని కీర్తికుమారి ఆచూకీ...
మునగపాక: ఉమ్మలాడ వద్ద శారదానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కీర్తికుమారి ఆచూకీ రెండో రోజు కూడా లభ్యం కాలేదు. ఈ నెల 6 తేదీన అనకాపల్లికి చెందిన బుద్ద కీర్తికుమారి ఉమ్మలాడ శారదానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలాన్ని ఆదివారం సాయంత్రం పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వారి వెంట ఎస్‌ఐ ప్రసాదరావు పాల్గొన్నారు. కాగా కీర్తి కుమారి కుటుంబ సభ్యులు శారదానది ఒడ్డున అచేతనంగా వేచి ఉన్న దృశ్యం అందరినీ కంటతడిపెట్టింది.