
అంకంరెడ్డి జమీలు సేవలు చిరస్మరణీయం
నాతవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీఈసీ మాజీ సభ్యుడు దివంగత నేత అంకంరెడ్డి జమీలు వర్ధంతి ఆదివారం నాతవరంలో నిర్వహించారు. ప్రధాన కూడలి జంక్షన్‌లో దివంగత నేత జమీలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. తర్వాత జమీలు కుటుంబీలకుతో కలిసి నాతవరం శ్వశాన వాటికను శుభ్రం చేసి చేతి బోరు ఏర్పాటు చేసి జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స, సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు ప్రారంభించారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు కోసం పనులు చేస్తున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు డైరెక్టరు అంకంరెడ్డి పార్వతి, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అద్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, పామాయిల్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టరు పైల పోతురాజు, నాతవరం–1 ఎంపీటీసీ సభ్యులు కరక రేణుక నాతవరం–2 ఎంపీటీసీ సభ్యులు చెక్కా ప్రభావతి వైఎస్సార్‌సీపీ మండల యూత్ ఉపాధ్యక్షుడు రుత్తల నాగు, హైస్కూల్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ రెడ్డి వరహాలబాబు, పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చెక్కా జోగిరాజు, మహిళా విభాగం మండల శాఖ అధ్యక్షురాలు పోలుపర్తి రాధ, గ్రామ కమిటీ అధ్యక్షుడు లచ్చబాబు పాల్గొన్నారు.

అంకంరెడ్డి జమీలు సేవలు చిరస్మరణీయం