
శారదానదిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
శారదానదిలో గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, (ఇన్‌సెట్) గల్లంతైనకీర్తికుమారి(ఫైల్)
మునగపాక : మండలంలోని ఉమ్మలాడ శారదానదిలో శనివారం ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. యువతి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ పి.ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. అనకాపల్లికి చెందిన బుద్ద కీర్తి కుమారి అనకాపల్లి బెల్లం మార్కెట్‌లోని వైశ్యా బ్యాంక్‌లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె మునగపాక మండలం ఉమ్మలాడ శారదానదిలో దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగ్ని మాపక శాఖ అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు రాత్రి 8 గంటల వరకూ వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాగా కీర్తికుమారి ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

శారదానదిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం