
బాధితురాలికి పోగొట్టుకున్న వస్తువుల అప్పగింత
అచ్యుతాపురం రూరల్ : పోగొట్టుకున్న వస్తువులను బాధితురాలికి స్థానిక పోలీసులు అందజేశారు. సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాంబిల్లి మండలానికి చెందిన కందూరు సత్యవతి శనివారం ఉదయం 11 గంటల సమయంలో అచ్యుతాపురం కూడలిలోని జ్యూస్ షాప్ వద్ద 20 తులాల వెండి పట్టీల పర్సును పోగొట్టుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల సహాయంతో పోగొట్టుకున్న వస్తువులను గుర్తించారు. ఆమెకు పట్టీలు, ఇతర సామాన్లు అప్పగించినట్టు సీఐ తెలిపారు.
సత్యవతికి పోగొట్టుకున్న వెండి వస్తువులు అందిస్తున్న సీఐ