యూరియా కోసం తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం తప్పని తిప్పలు

Sep 7 2025 7:34 AM | Updated on Sep 7 2025 7:34 AM

యూరియ

యూరియా కోసం తప్పని తిప్పలు

రావికమతం: యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్‌ తగ్గ యూరియా సకాలంలో రాకపోడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసిన తరువాత వరి ఎదుగుదలకు యారియా సకాలంలో తప్పనిసరిగా వేయాలి. ఈ తరుణంలో రైతులు యారియాం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తకోట పీఏసీఎస్‌ 12 టన్నులు యారియా మాత్రమే వచ్చింది. ఆధార్‌ కార్డ్‌, పాసుబుక్‌ జెరాక్స్‌ ఉన్న రైతుకు ఎకరానికి బస్తా మాత్రమే ఇస్తున్నారు. కొత్తకోట పీఏసీఎస్‌ వద్దకు యారియా కోసం రైతులు ఎక్కువగా రావడంతో రైతు సేవా కేంద్రం సిబ్బంది, సహకార సంఘం సిబ్బంది, మహిళా పోలీసుల సహాయంతో పంపిణీ చేశారు.

దేవరాపల్లి: మండలంలో శనివారం బోయిలకింతాడ, ఎ.కొత్తపల్లి రైతు సేవా కేంద్రాలు, దేవరాపల్లి మన గ్రోమోర్‌ షాపు వద్ద పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. మన గ్రోమోర్‌ షాపునకు అధిక సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసింది. కొంత మంది నుంచి మాత్రమే ఆధార్‌, వన్‌బీ ధ్రువపత్రాలు తీసుకొని, మిగతా వారు మరుసటి రోజు రావాలని అధికారులు సూచించడంపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పనులు మానుకొని వచ్చామని, మళ్లీ ఒక్క బస్తా కోసం రావాలంటూ ప్రశ్నించారు. బోయిలకింతాడలో ఉదయం నుంచి రైతులు అధిక సంఖ్యలో ఎగబడ్డారు. ఎంత విస్తీర్ణం ఉన్నా ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.కొత్తపల్లి రైతు సేవా కేంద్రంలో ముషిడిపల్లి, కొత్తూరు ముత్యాలమ్మపాలెం, యండపల్లిపాలెం రైతులకు ఆధార్‌, వన్‌బీ ధ్రువపత్రం ఆధారంగా పోలీసుల సమక్షంలో పంపిణీ చేశారు. ఒక్క బస్తా కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కె.కోటపాడు : బస్తా యూరియా కోసం కె.కోటపాడు రైతు సేవా కేంద్రానికి శనివారం ఉదయం 6 గంటల నుంచే రైతులు వేచి ఉన్నారు. మండలంలో కె.కోటపాడు, గుల్లేపల్లి, మేడిచర్ల గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో 32 టన్నుల యూరియా వచ్చింది. క్యూలో ఉండి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చింది. గతంలో యూరియా కోసం ఇటువంటి ఇబ్బందులు పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా కోసం తప్పని తిప్పలు 1
1/2

యూరియా కోసం తప్పని తిప్పలు

యూరియా కోసం తప్పని తిప్పలు 2
2/2

యూరియా కోసం తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement