
యూరియా కొరత లేకుండా చేస్తాం..
పి.కె.గూడెం పీఏసీఎస్‌లో రైతులతో మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఏవో
నాతవరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని మండల ప్రత్యేకాధికారి మంగవేణి తెలిపారు. ‘రైతుకు ఒకే ఒక బస్తా’ శీర్షికతో ఈ నెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలో పి.కె.గూడెం పీఏసీఎస్‌ను శనివారం ఆమె తహసీల్దార్ వేణుగోపాల్, మండల వ్యవసాయాధికారి సుగుణ సందర్శించారు. యూరియా నిల్వలను పరిశీలించారు. రైతులతో సమావేశమై వరి పంట సాగుకు సంబంధించి యూరియాతో పాటు అన్ని రకాలు ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం 12 టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో రామారావు, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

యూరియా కొరత లేకుండా చేస్తాం..