
తీర ప్రాంతాల్లో అనుమానితులపై సమాచారమివ్వండి
రాంబిల్లి(అచ్యుతాపురం) : తీర ప్రాంతాల్లో కనిపించే అనుమానిత వ్యక్తులు, విదేశీ బోట్ల కదలికల సమాచారాన్ని తమకు తెలపాలని అచ్యుతాపురం మైరెన్ సీఐ ఎస్ సింహాద్రి నాయుడు సూచించారు.రాంబిల్లి మండలంలోని వాడ రాంబిల్లిలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన స్థానిక మత్స్యకారులతో మమేకం అయ్యారు. మత్తు పదార్థాల రవాణా వంటి కార్యకలాపాలు తీర ప్రాంతాల్లో జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చేపల వేటకు వెళ్లిన తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దేశ రక్షణలో తీర ప్రాంతాల మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తూ, అనుమానాస్పద కదలికల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1093కి తెలియపరచాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమ్య, వీఆర్‌ఓ ఎస్.కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వి,లావణ్య, ఎస్‌ఐ నాగేంద్ర, నేవల్ ఇంటెలిజెన్స్ జి.అనిల్ కుమార్, కోస్టల్ సెక్యూరిటీ జగదీష్, ఎస్.జ్యోతిక, అప్పారావు, మైరెన్ ఎస్‌ఐ బి.రాజు, మైరెన్ సిబ్బంది పాల్గొన్నారు.