
సచివాలయమా? కూటమి కార్యాలయమా?
ఉమ్మలాడలో సచివాలయ ప్రధాన గేటు ముందు కూటమి నేతల ఫ్లెక్సీలు
మునగపాక: విద్య, వైద్య కేంద్రాల సమీపంలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఉండరాదన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. అధికారంలో ఉన్నాం కదా అడిగేదెవరన్న రీతిలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఉమ్మలాడలో సచివాలయం ప్రధాన గేటు ముందు కూటమి నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెల దాటినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం సచివాలయానికి పలు సేవల కోసం ప్రజలు వస్తూ పోతుంటారు. స్థానికంగా ఉన్న నేతలు తమ అధినాయకుల పట్ల స్వామి భక్తుని చాటేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు వాటిని తొలగించకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.