
రైతుకు ఒకే ఒక బస్తా
యూరియా కోసం అన్నదాతల వాగ్వాదం
పి.కె.గూడెం
పీఏసీఎస్‌లో అవస్థలు
నాతవరం: పి.కె.గూడెం పీఏసీఎస్‌లో శుక్రవారం తగినంత యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముందు రోజున ఎరువులు విక్రయిస్తామని చెప్పడంతో శుక్రవారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఒక్కంటికీ ఒక్కబస్తాయే పంపిణీ చేశారు. పాసుపుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒకే ఒక బస్తా సరఫరా చేయడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పి.కె.గూడెం పి.జగ్గంపేట గ్రామాలకు చెందిన రైతులు ఒకేసారి రావడంతో యూరియా అయిపోతుందన్న భయంతో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఒక లారీలో యూరియా 267 బస్తాలే రావడంతో తోపులాట చోటుచేసుకుంది.