
ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత
జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన
అనకాపల్లి టౌన్: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి గురుపూజోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న బ్యాగులు, దుస్తులపై సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోలు ముద్రించాలని మంత్రి కోరారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధనలో మార్పులను తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయుల కృషితో 2024–25 సంవత్సరంలో రాష్ట్ర స్ధాయిలో జిల్లా ఉత్తీర్ణత శాతం 5వ స్థానానికి తెచ్చామన్నారు. ప్రతీ పాఠశాలలో యూత్ క్లబ్, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అనిత అవార్డులు అందజేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆరుగురు, స్కూల్ అసిస్టెంట్స్ 20 మంది, ఎస్‌జీఎస్‌టీ టీచర్లు 13 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఆర్డీవో షేక్ ఆయిషా, జల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయులు కె.సుభాష్ చంద్రబోస్ (తామరబ్బ ఎంపీయూపీ స్కూల్, దేవరాపల్లి), చంద్రశేఖర్ (వెలంకాయలపాలెం ఎంపీపీ పాఠశాల, రోలుగుంట), డి.రవి (మాకవరపాలెం ఉన్నత పాఠశాల), డీఆర్‌కే శాస్త్రి (నక్కపల్లి), కె.దండెంనాయుడు, (ఎంపీపీ స్కూల్, పాత వాలాబు, దేవరాపల్లి), జి.వి.రమణ (భీమవరం ఎంపీపీ స్కూల్, ఎస్.రాయవరం), ఎం.మురళీకృష్ణ (కె.కోటపాడు హైస్కూల్), ఎ.వి.రామాచార్యులు (ఎస్.రాయవరం హైస్కూల్), నిమ్మల రమ (వడ్డాది ఎంపీపీ స్కూల్)

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత

ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత