
యూరియా సరఫరాలో సర్కారు విఫలం
అనకాపల్లి: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయం పెద్ద దండగ అని భావించే సీఎం చంద్రబాబు పాలనలో మళ్లీ రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో నిరసన తెలియజేసి, వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు యూరియా తదితర ఎరువులు సరఫరా చేశారని, కూటమి పాలనలో ఆర్బీకేల పేరు మార్చారు తప్ప అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదన్నారు. యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అనకాపల్లి పట్టణంలో అన్నపూర్ణ బ్యాంక్ వద్ద రైతులు రాత్రి వరకూ పడిన ఇబ్బందులను వీడియో ద్వారా విలేకరులకు ఆయన ప్రదర్శించారు. రైతులకు కావలసిన యూరియా పీఏసీఎస్‌లో 30 శాతం ఉంటే, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 70 శాతం ఉందన్నారు.
మెడికల్ కళాశాల ప్రైవేటుపరానికి కుట్ర
వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా.. ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో చేపట్టి ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. అనకాపల్లిలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తే, స్థానిక నేతలు అడ్డుకుని కోర్టులో కేసులు వేయడం వలన నర్సీపట్నం నియో జకవర్గం మాకవరపాలేనికి మార్చామన్నారు. గత పాలనలో రెండో అంతస్తు వరకూ పనులు చేయగా, కూటమి పాలన వచ్చాక పనులు నిలిచిపోయాయన్నారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల రహదా రి పరిస్థితి చూస్తే ఎందుకు గెలిపించుకున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
సుగర్ ఫ్యాక్టరీల అడ్రస్ గల్లంతు
జిల్లాలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసే విధంగా కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని అమర్‌నాథ్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీకి సుమారు రూ.40 కోట్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఏడాది కూటమి పాలనలో గోవాడ సుగర్స్ బకాయిలు రూ.35 కోట్లు ఉన్నాయని, చెర కు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యేలు చెప్పడం దారుణమన్నా రు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్, అన్నపురెడ్డి అదీప్‌రాజు, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పట్టణ అ ధ్యక్షుడు జానకీరామరాజు, నియోజకవర్గ యువజ న విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ పాల్గొన్నారు.