పట్టాల పండగ.. ఆనందం నిండుగ | - | Sakshi
Sakshi News home page

పట్టాల పండగ.. ఆనందం నిండుగ

Sep 6 2025 5:14 AM | Updated on Sep 6 2025 5:14 AM

పట్టా

పట్టాల పండగ.. ఆనందం నిండుగ

ఘనంగా డీఎస్‌ఎన్‌ఎల్‌యూ స్నాతకోత్సవం

ఐదు బ్యాచ్‌ల విద్యార్థులకు పట్టాల ప్రదానం

అతిథులుగా హాజరైన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు

పట్టాలతో కేరింతలు కొట్టిన విద్యార్థులు

విశాఖ సిటీ: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) పట్టభద్రుల కేరింతలతో బీచ్‌రోడ్డు మార్మోగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో పలు రాష్ట్రాల నుంచి విశాఖలో న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు నోవాటెల్‌ హోటల్‌లో సందడి చేశారు. శుక్రవారం హోటల్‌లో డీఎస్‌ఎన్‌ఎల్‌యూ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గత ఐదేళ్లలో యూనివర్సిటీలో పలు కోర్సులో ఉత్తీర్ణులైన వారికి పట్టాల అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, అతిథులుగా జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ పి.నరసింహా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ హాజరయ్యా రు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులను బంగారం, వెండి పతకాలతో పాటు పట్టాలను అందజేశారు. ఇందులో 397 మంది బీఏ ఎల్‌ఎల్‌బీ, 153 మందికి ఎల్‌ఎల్‌ఎం, నలుగురికి పీహెచ్‌డీ, ఇద్దరికి ఎల్‌ఎల్‌డీ పట్టాలు అందించారు. అలాగే 153 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. బ్యాచ్‌ వారీగా విద్యార్థులు న్యాయమూర్తులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తమ జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల సందడి : కోవిడ్‌, ఇతరత్రా కారణాల తో గత ఐదేళ్లుగా డీఎస్‌ఎన్‌ఎల్‌యూ స్నాతకోత్స వం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఐదేళ్లలో న్యా య విద్యను పూర్తి చేసిన వారు ఇప్పటికే న్యాయవాదు లుగా ప్రాక్టీసు ప్రారంభించారు. 8 నుంచి 12 బ్యాచ్‌లకు ఒకేసారి పట్టా లు అందించేందు కు డీఎస్‌ఎన్‌ఎల్‌ యూ వైస్‌ చాన్సల ర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.సూర్యప్రకాశరావు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. దీంతో సందడి నెలకొంది.

పట్టాల పండగ.. ఆనందం నిండుగ1
1/1

పట్టాల పండగ.. ఆనందం నిండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement