
ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడంలో కూటమి ప్రభు త్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా సీజన్ ప్రారంభంలోనే అవసరమైన ఎరువుల సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి భారీ క్యూలైన్లో నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అవసరమైన యూరియాను పుష్కలంగా సర ఫరా చేశామన్నారు. రోజంతా పనులు మానుకొని పడిగాపులు కాస్తే ఎంత విస్తీర్ణం ఉన్నా, బస్తా యూరియా ఇస్తుండటం దారుణమన్నా రు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తూ పో రాడుతుండటంతో కూటమి ప్రభుత్వం ఇ ప్పు డు పరుగులు పెడుతుందని, ముందుగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి ఉంటే ఇబ్బందులు తప్పేవని తీవ్రంగా మండిపడ్డారు.