
నేడు గురు పూజోత్సవం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గుండాలవీధి ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విధ్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. మండలంలోని కొప్పాక జెడ్పీ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని, జల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. అనంతరం గురుపూజోత్సవ కార్యక్రమాల బ్రోచర్‌ను విడుదల చేశారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు, సహాయ కమిషనర్ శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, రామలింగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.