
ఉత్తమ అధ్యాపకుడిగా వడ్డాది ప్రిన్సిపాల్
నర్సీపట్నం/బుచ్చెయ్యపేట: వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.చిన్నా రావు రాష్ట్ర ఉత్తమ అధ్యాప కుడు పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రభుత్వం ప్రక టించిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులలో ప్రిన్సిపాల్ చిన్నారావు ఉన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకులుగా ఆయన గతంలో సేవలందించారు. ఇన్‌చార్జి ప్రి న్సిపాల్‌గా కూడా పనిచేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాది జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఇంగ్లిష్‌లో నూటికి నూ రు శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేశారు. విద్యార్థులు స్టేట్ అవార్డులు సాధించడానికి తర్ఫీదు ఇచ్చారు. ఆయన కృషికి ఫలితంగా ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికయ్యారు.

ఉత్తమ అధ్యాపకుడిగా వడ్డాది ప్రిన్సిపాల్