
మాజీ సీఎం జగన్‌ను కలిసిన బూడి
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఈర్లె అనురాధ
దేవరాపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ముత్యాలనాయుడు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఈర్లె అనురాధతో కలిసి ఆయన ప్రత్యేకంగా కలిశారు.