
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గొలుగొండ: రోడ్డు ప్రమాదంలో సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. చోద్యం గ్రామానికి చెందిన పైల ప్రభాకర్(33) నర్సీపట్నం నుంచి చోద్యంకు రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై వెళ్తుండగా పప్పుశెట్టిపాలెం మలుపు వద్ద కుక్కను ఢీకొని కింద పడిపోయాడు. ఈ ఘటనలో ప్రభాకర్ తలకు బలమైన గాయం కావడంతో ఆ సమయంలో అటుగా వెళుతున్న కొంత మంది 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి క్షతగాత్రుడిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించే ప్రయత్నంలో ఏరియా ఆస్పత్రిలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన ప్రభాకర్