6 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

6 కిలోల గంజాయి పట్టివేత

Jun 18 2025 11:15 AM | Updated on Jun 18 2025 11:15 AM

6 కిలోల గంజాయి పట్టివేత

6 కిలోల గంజాయి పట్టివేత

మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు 6 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేశారు. నలుగురు నిందితులతో పాటు 6 కిలో ల గంజాయిని పట్టుకున్నారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని, నంద్యాల జిల్లా బేతంచర్ల ప్రాంతానికి చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement