● డీఈవో భానుమూర్తిరాజు
పాడేరు రూరల్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యలో చదువు మానేసినవారు, పై చదువులు కొనసాగించాలనుకునేవారు, పాఠశాలలు, కళాశాలల్లో చదువు కొనసాగించలేకపోయినవారు, ఇతర కారణాలతో విద్యకు దూరమైనవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.


