ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

చింతపల్లి: ఉపాధి హామీ వేతనదారులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ డీవీవీ విద్యాసాగర్‌ హెచ్చరించారు. సోమవారం చింతపల్లి మండల పరిషత్‌ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగుల మండలాల ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభల్లో వేతనదారులకు అవసరమైన పనులను పారదర్శకంగా గుర్తించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలన్నారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి పనులను ఎలా గుర్తించాలి, ఎలా అమలు చేయాలనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీడీ పవన్‌కుమార్‌, ప్లాంటేషన్‌ మేనేజర్‌ దొరబాబు, టెక్నికల్‌ హెడ్‌ రఘు, ఏపీవోలు రాంప్రసాద్‌, అప్పలరాజు, కొండబాబుతో పాటు నాలుగు మండలాల టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement