సాక్షి, పాడేరు: జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని విభాగాల వైద్యులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుజ్జిరాజు ఆదేశించారు. మంగళవారం ఆయన తొలిసారిగా పాడేరు జిల్లా సర్వజన ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర వైద్యులు పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ వైద్య విభాగాలు, రోగుల వార్డులను పరిశీలించిన ప్రిన్సిపాల్.. రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోజువారీ ఓపీ, అందిస్తున్న వైద్యసేవలు, ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న కేసులపై సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్ బుజ్జిరాజు


