మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

● ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేష్‌బాబు

● ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేష్‌బాబు

రైతులకు సూచనలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త

గూడెంకొత్తవీధి: వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తగిన మెళకువలు పాటించాలని చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేష్‌బాబు సూచించారు. శుక్రవారం ఏబులంలో నిర్వహించిన పొలంబడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరి పంటలో అంకుర నిర్మాణం అనంతరం కంకి బయటకు వచ్చే దశలో మొక్కలకు అవసరమైన పోషకాలను అందించాలని సూచించారు. గింజలు ఏర్పడే సమయంలో పొటాష్‌ ఎరువులు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పొటాష్‌ లోపం వల్ల కలిగే సమస్యలు, వాటి నివారణ చర్యలను తెలియజేశారు. పంట దశను అనుసరించి రైతులు నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో సురేష్‌, ఏడీఏ సింహాచలం, ఏపీసీఎన్‌ఎఫ్‌కు చెందిన గణేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement